కుప్పం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది?

8 Sep, 2019 09:55 IST|Sakshi
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కుప్పం జమీందారు ప్యాలెస్‌

సాక్షి, కుప్పం: మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కుప్పం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే కంగుందికోట. జమీందార్ల పాలన కోసం నిర్మితమైన ప్యాలెస్‌ ఇది. జమీందారీ వంశస్తులు రాజా వెంకటపతినాయుడు చివరగా కుప్పం ప్రాంతాన్ని పరిపాలించారు. ఆయన జ్ఞాపకార్థం పట్టణ నడిబొడ్డున ఉద్యానవనం నిర్మించి, రాజా వెంకటపతినాయుడు విగ్రహాన్ని 106 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయన విగ్రహం అందరికీ దర్శనమిస్తోంది. ఈ ప్యాలెస్‌ కుప్పానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరని రూపంతో చూపరులను ఆకట్టుకుంటోంది. జమీందారీ వంశస్తులు బయటి ప్రాంతాల్లో స్థిరపడినా వారి పాలనను గుర్తించే విధంగా ప్యాలెస్‌ కనిపిస్తోంది. ఐదు అంతస్తుల పురాతన కట్టడాలతో నిర్మితమై కుప్పం జ్ఞాపకంగా మారింది. ఈ ఉద్యానవనానికి వెళ్లగానే కుప్పం ప్రాంతాన్ని జమీందార్లు పరిపాలించారనే చరిత్రను తెలియజేస్తుంది. ఏళ్లు గడిచినా జమీందార్ల పాలనలో ఉన్న జ్ఞాపకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.


రాజా వెంకటపతి నాయుడు విగ్రహం

మరిన్ని వార్తలు