అకాల వర్షాలు.. 8,314 హెక్టార్లలో పంట నష్టం

27 Apr, 2020 16:08 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పాడైన రబీ పంటలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు పరిశీలించారు. కాకినాడ రూరల్‌లో  సోమవారం పర్యటించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 7,455 వరి దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. మొక్కజొన్న 539 హెక్టార్లలో, నువ్వులు 275, వేరు శెనగ 23, సన్‌ఫ్లవర్‌ 5 హెక్టార్లలో.. మొత్తం 8,314 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2266 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. (అయ్యా బాబోయ్‌.. ఈ స్టంట్‌ ఎ‍ప్పుడూ చూడలేదు)
 
తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతు ఆందోళనలో ఉన్నాడని ఎవరైనా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తక్షణమే బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేయమని మిల్లర్లను కోరుతున్నామన్నారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. (ఇక ఎప్పటికీ ఇంటి నుంచి పనిచేసే హక్కు! )

మరిన్ని వార్తలు