‘ఆ ఆనందంలో ఉన్న తీపి ఎలాంటిదో తెలిసిన వాడ్ని’

13 Feb, 2020 14:47 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : దళారీ వ్యవస్థను తొలగించినప్పుడే రైతులకు విలువ పెరిగి.. వినియోగదారునికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో రూ.50 లక్షల నిధులు మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే రైతు బజారును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గురువారం కాకినాడ అర్బన్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ప్రమాణ స్వీకార సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటేడ్‌ పదవుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక విప్లవాన్ని సృష్టించరన్నారు. యాభై శాతం రిజర్వేషన్‌లు ఉండాలని చట్టం రూపంలో తీసుకు వచ్చారని, బహుశా దేశ చరిత్రలో ఇది ఎవ్వరూ చేయని సాహసమని కొనియాడారు. త్వరలోనే మొబైల్‌ రైతు బజార్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రూ. 3వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసి.. రైతులకు అండగా ఉంటామని సీఎం వైఎస్‌ జగన్ ఒక సందేశాన్ని ఇచ్చారని మంత్రి అన్నారు. (11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి)

పార్టీ కోసం అహర్నిశలు కష్టడిన వారికి గుర్తింపు వస్తే ఆ ఆనందంలో ఉన్న తీపి ఎటువంటిదో తెలిసిన వాడినని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్ట పడే వారికి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్ తగిన గుర్తింపు, హోదాను కల్పిస్తారన్నారు. దేవాలయ కమిటీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎవ్వరికి పెన్షన్లు పోలేదని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఇచ్చిన తప్పుడు పేర్లను పరిశీలించి తొలగించడమైనదని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు పోతే వార్డు సెక్రటేరియట్‌కు వెళ్ళి మళ్ళీ దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. కాకినాడ నగరంలో పది వేల ఇళ్ళు ఇస్తామని హమీ ఇచ్చానని, ఆ హమీని వచ్చే మార్చి 25 న అమలు చేస్తానని తెలిపారు. ఇంటి కోసం 34 వేల దరఖాస్తులు వచ్చాయని, మార్చి 25న నవరత్నాల పథకంలోఅందిరికీ ఇళ్ళు పథకాన్ని ముఖ్యమంత్రి కాకినాడ నుండే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. 

మరిన్ని వార్తలు