‘ఈ-కర్షక్ నమోదు లేకపోయినా కొనుగోళ్లు’

20 Feb, 2020 16:18 IST|Sakshi

సాక్షి, కాకినాడ : రాష్ష్ర్టంలో రైతు భరోసా కేంద్రాలు ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా మారనున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచే ఈ రైతు భరోసా వ్యవస్థ పుట్టిందని, పక్కనున్న పొరుగు రాష్ట్రాలు కూడా పని తీరుపై ఆరా తీయడం గొప్ప విషమమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి వ్యవసాయశాఖలో ఉన్న అధికారులు, కొన్ని కేంద్ర సంస్థలు రైత భరోసా కేంద్రాలను అభినందించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు వస్తాయి. ఏజెన్సీలో ఉన్న మండలాల్లో రెండో దశలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. (‘గతంలో జరిగిన అక్రమాలకు బాబు సమాధానం చెప్పాలి’)

వ్యవసాయ అనుబంధ శాఖల మధ్య అనుసంధానం, సమన్వయం ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీ‌ని కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వ్యవసాయ శాఖ జెడి కన్వీనర్‌గా జెసీతో పాటుగా అన్ని శాఖల అధికారులు సభ్యులుగా ఒక కమిటీ నియమించామని పేర్కొన్నారు. దీని వల్ల క్షేత్ర స్దాయిలో రైతుకు అవసరమైన నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర స్ధాయిలో కూడా ఒక కమిటీని కూడా నియమించామని, దీనికి వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ చైర్మన్‌ గా ఉంటారని కన్నబాబు తెలిపారు. (ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర)

కంది, శనగ రైతులకు శుభవార్త
ఈ సందర్భంగా కంది, శనగ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుభవార్త చెప్పారు. ఈ-కర్షక్ నమోదు లేకపోయినా కందులు, శెనగలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ ను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో మార్క్ ఫెడ్ ద్వారా 98 కందుల కొనుగోలు కేంద్రాలు, 100 శెనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, గతంలో ఈ పంటలు ఈ-కర్షక్‌లో నమోదు అయితే కాని కొనుగోలు చేసేవారు కాదన్నారు. కాగా ఆ అవసరం లేకుండానే కందులు, శెనగల ఉత్పత్తులను ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోలుకు అనుమతిస్తామని, కాకపోతే సంబందిత వ్యవసాయ శాఖ అధికారి నుంచి రైతులు లెటర్ తీసుకురావల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మార్క్ ఫ్రెడ్  కొనుగోలు కేంద్రాల నుంచి 1లక్షా 95 వేల క్వింటాళ్ళు కందులు, 5 లక్షల 79,329 క్వింటాళ్ళు శెనగలు కొనుగోలు చేశామన్నారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా పలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు.

మరిన్ని వార్తలు