కర్ణాటక నుంచి కర్నూలుకు చేరుకున్న విద్యార్థులు

13 May, 2020 13:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా కారణంగా అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఆగి పోయారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ఇంటికి చేరలేక లాక్‌డౌన్‌కి ముందు ఎక్కడ ఉన్నారో అక్కడే చిక్కకుపోయి నానా కష్టాలు పడుతున్నారు. మార్చి నెలలో మొదలయిన లాక్‌డౌన్‌ ఇప్పటికి మూడు సార్లు పొడిగించి మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీంతో నానాటికి వలస కార్మికులు, వేరే ప్రాంతాల్లో ట్రైనింగ్‌ కోసం వెళ్లిన విద్యార్ధులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. (వారి వివరాలు తెలుసుకోవడానికి వెళితే దాడి చేశారు!)

అయితే మే 1 నుంచి వలస కార్మికులను, వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే శ్రామిక్‌ రైలు ద్వారా నిన్న కొంత మంది మత్యకారులు, వలస కూలీలు చెన్నై నుంచి శ్రీకాకుళం చేరుకున్నారు. ఇక బుధవారం నాడు కూడా సోలాపూర్‌ అగ్రికల్చర్‌ కాలేజీకి ట్రైనింగ్‌ కోసం వెళ్లి లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకు పోయిన 31 మంది విద్యార్థిని విద్యార్థులు కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వారిని జిల్లాలోకి తీసుకువచ్చారు. జిల్లాకు వచ్చిన విద్యార్థిని విద్యార్ధులను మొదట క్వారంటైన్‌లో ఉంచి అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు కోవిడ్‌-19 ఫలితాలు నెగిటివ్‌ అని తెలితే వారిని అక్కడి నుంచి వారి సొంత ఊర్లకు పంపించనున్నారు. (మాజీ మంత్రి ఇంట్లో విషాదం)

మరిన్ని వార్తలు