గుర్రంపై తిరుగుతూ..

31 Mar, 2020 10:11 IST|Sakshi

ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి ఎస్‌ఐ మారుతీ శంకర్‌ సోమవారం తెల్లని గుర్రంపై ఎరుపు రంగులో కరోనా వైరస్‌ గుర్తులు వేయించి దానిపై కూర్చొని తిరుగుతూ ప్రజలకు కరోనా గురించి ప్రచారం చేశారు. 

కరోనాను కాటికి పంపాలని..
ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు ఎం.విజయలక్ష్మి (70). ఈమె గుంటూరు నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి పదవీ విరమణ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉంటున్న తన కుమార్తె ఇంటికి ఏడాది క్రితం వచ్చింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నేనూ సైతం అంటూ ఇలా ఆకివీడు పురవీధుల్లో చీపురు పట్టి పారిశుధ్య పనులు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. – ఆకివీడు

కరోనాపై ‘పోలీస్‌’ంగ్‌
విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై బొమ్మలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో సోమవారం  బొమ్మల మాస్క్‌లు ధరించిన వ్యక్తులతో మయూరీ జంక్షన్‌ నుంచి బాలాజీ కూడలి వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.– విజయనగరం క్రైమ్‌

సరిహద్దు సంగతి
రాష్ట్ర సరిహద్దులు దాటి ఎవరూ లోనికి రాకూడదన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట సీఐ నాగేంద్రకుమార్‌ నేతృత్వంలోని పోలీసులు ఏపీ, తెలంగాణ ప్రధాన సరిహద్దు గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. అక్కడ నిలిచిపోతున్న వాహనాల డ్రైవర్లకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. సోమవారం కూడా డ్రైవర్లకు, అత్యవసర వాహనాల సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేశారు. ఎస్‌బీ సీఐ రమణ, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్‌ఐలు అభిమన్యు, రాజు, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.          – గరికపాడు (జగ్గయ్యపేట)

మరిన్ని వార్తలు