‘కరోనా’ వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయొద్దండి

28 Mar, 2020 09:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడేందుకు యువత గూగుల్‌లో వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్స్‌ను కూడా చదువుచున్నారు. ఈ వైరస్‌ సమాచారంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో సైబర్‌ నేరగాళ్ల కూడా అదే రూట్‌లో వల వేస్తున్నారని ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెయిల్, బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన వాటిని హ్యాక్‌ చేసేందుకు కరోనా వైరస్‌ పేరుతో వెబ్‌సైట్‌లు రూపొందించి యువతకు వల వేస్తున్నారని తెలిపారు.  (కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు)

పదుల సంఖ్యలో ఇలా కరోనా వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నాయని వాటిని సైబర్‌ క్రైం పోలీస్‌లు గుర్తించారని పేర్కొన్నారు. coronavirursstatus(.)space, coro navirus(.)zone, coronavir s-realtime(.com) bgvfr.coro navirusaware(.)xyz  ఇవి చాలా డేంజరస్‌ డొమైన్స్‌ అని వీటిని క్లిక్‌ చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ అలర్ట్‌ వెబ్‌సైట్లు అసలు ఓపెన్‌ చేయొద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సైబర్‌  ల్యాబ్‌ పోలీస్‌లకు గాని, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు