సంకల్ప సంబరం

10 Jan, 2019 13:13 IST|Sakshi
మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా వేడుకలు

పాదయాత్రలు, బైక్‌ర్యాలీలు, ర్యాలీలతో సంఘీభావం

మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఐదువేల మందితో పాదయాత్ర  

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగియగానే జిల్లాలో సంబరాలుఅంబరాన్నంటాయి. సంఘీభావంగా పాదయాత్రలు, బైక్‌ర్యాలీలు, ర్యాలీలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల్లో కేక్‌లు కట్‌ చేసి..ప్రజలకు పంచిపెట్టారు. ఆలయాల్లో వైఎస్‌ జగన్‌ పేరిట అర్చనలు చేయించారు. వైఎస్సార్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఐదు వేల మందితో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి రాఘవేంద్రస్వామి ప్రధాన ముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, 167 జాతీయ రహదారి మీదుగా హెచ్‌ఆర్‌బీ కల్యాణ మండపం వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కుటుంబం విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటపై నిలబడే నాయకుడని కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు చరిత్ర సృష్టించారన్నారు.  

కర్నూలు ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ నగర అ«ధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, లక్కీటూ నరసింహులు యాదవ్‌ తదితరులు భారీ పూలమాల వేసి.. పాలాభిషేకంచేశారు. ఇక్కడే కేక్‌లు కట్‌ చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.  
కర్నూలు వినాయక స్వామి దేవాలయం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుడు, సాయిబాబాకు వైఎస్‌ జగన్‌ పేరిట అర్చన చేయించారు. అనంతరం 516 కొబ్బరికాయలను సమర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు.   
కల్లూరు శరీన్‌నగర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి కల్లూరు అర్బన్‌ వార్డుల ఇన్‌చార్జ్‌ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి.. పాలాభిషేకం చేశారు.   
నంద్యాలలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మాజీ  చైర్మన్‌ కైపరాముడు, శిల్పా మహిళా సహకార్‌ చైర్మన్‌ శిల్పా నాగినీరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటి నుంచి శ్రీనివాస సెంటర్‌ వరకు ర్యాలీ కొనసాగింది.
ఆదోనిలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు దేవా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు.  
పత్తికొండలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, జిల్లా నాయకుడు కారం నాగరాజు, మండల కన్వీనర్‌ బజారప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు.  
బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీఆర్‌ వెంటేశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కేక్‌ కట్‌ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు.  
హాలహర్విలో మండల కన్వీనర్‌ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి..మిఠాయిలను పంచిపెట్టారు.  

మరిన్ని వార్తలు