రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న

22 May, 2020 19:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కువైట్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసులను ప్రభుత్వం వెనక్కి రప్పించిందని ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం కువైట్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. గత నెలలుగా కువైట్‌లో ఉపాధి లేక ఏపీ వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కువైట్‌లో చిక్కుకున్న బాధితుల్ని వెనక్కి తీసుకురావాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారని తెలిపారు.
(రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల)

సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం..
అమ్నెస్టీ సాయంతో 152 మంది బాధితులు ఏపీకి చేరుకున్నారని వెల్లడించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తామని వెంకట్‌ పేర్కొన్నారు. చొరవ తీసుకుని ఏపీకి రప్పించిన సీఎం వైస్‌ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
(విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత)

సీఎం వైఎస్‌ జగన్‌ కృషి ఫలితంగా..
గురువారం ప్రత్యేక విమానంలో కువైట్‌లోని 145 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.. వారిలో 126 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నూజివీడు త్రిబుల్‌ ఐటీలో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా వలస కార్మికులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు