‘సేంద్రియం’పై ప్రోత్సాహం కరువు

2 Dec, 2013 01:58 IST|Sakshi

గుర్రంపోడు, న్యూస్‌లైన్:  సేంద్రియ వ్యవసాయంతోనే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చనని అధికారులు చెబుతున్నా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం కరువైంది. గతంతో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సేంద్రియ వ్యవసాయానికి భారీగా రాయితీలు ప్రోత్సాహం  ఇచ్చాయి. కానీ నేడు అరకొరగా అందిస్తున్న సాయం పై రైతులకు సమాచారమే కరువైంది. గ్రామాల్లో పశుసంపద నానాటీకీ తగ్గిపోతున్న తరుణంలో సేంద్రియ ఎరువు దొరకడం కష్టంగా మారుతున్నది.
 వర్మికంపోస్టు యూనిట్లు ఏవీ
 సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ వానపాముల యూనిట్లు, నాడెప్ కంపోస్టు యూనిట్లు, వర్మి హాచరీలకు 75 శాతం వరకు రాయితీ అందించాల్సి ఉండగా నామమాత్రంగా మంజూరు చేస్తున్నారు. తగిన ప్రచారం చేయడం లేదు. కేవ లం రైతులు షెడ్ నిర్మించుకుని సబ్సిడీ పొందిన తర్వాత వేరే అవసరాలకు వినియోగిస్తున్నారనే సాకుతో రాయితీకి మంగళం పాడుతున్నారు. గతంలో రాయితీ పొదాలంటే ఉద్యానవన శాఖ  ఆధ్వ ర్యంలో రూ 30 వేల ఖర్చుతో రాతి కడీలతో తగినంత సైజులో తాటి కమ్మలతో కొట్టాన్ని నిర్మించుకోవాలి. వానపాములతో వర్మి కంపోస్టు తయారీ చేసుకుంటే   రూ 15వేలు రాయితీ అందించే వారు. ఇప్పుడు ఉద్యానవనశాఖ   వర్మిషెడ్లకు రాయితీని పూర్తిగా ఎత్తేశారు. వ్యవసాయశాఖ మాత్రం వర్మి కంపోస్టుషెడ్లు నిర్మించుకుంటే గతేడాది వరకు జేడీఏ తనిఖీ  చేసిన తర్వాత రూ 25వేలు మంజూరు అయ్యేవి. కాగాసేంద్రియ సాగును ప్రోత్సహనికి రాయితీని కొన సాగించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు