రూ. 39 లక్షలు పలికిన పుట్టలమ్మ తల్లి లడ్డూ

16 Jan, 2015 19:53 IST|Sakshi
రూ. 39 లక్షలు పలికిన పుట్టలమ్మ తల్లి లడ్డూ

గుంటూరు సమీప గ్రామాల ప్రజలు పవిత్రంగా నిర్వహించే శ్రీ ఘంటాలమ్మతల్లి- పుట్టలమ్మతల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మూడు రోజులపాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారి ప్రసాదం 9 కిలోల ప్రసాదం లడ్డూను వేలం వేశారు. ఆలయ కమిటీ పాటను రూ. 9 వేలతో ప్రారంభించగా అది రూ. 39 లక్షలకు వెళ్లింది. నల్లపాడు మాజీ సర్పంచ్ చల్లా సాంబిరెడ్డి ఈ లడ్డూను రూ. 39 లక్షలకు పాడుకున్నారు. గత ఏడాది ఇదే లడ్డూను వేలంలో తానే రూ 20.9 లక్షలకు పాడుకున్నానని, ఈసారి కూడా అమ్మ దయతో లడ్డూ తనకే దక్కిందని సాంబిరెడ్డి చెప్పారు.

ఏటా అమ్మవారికి అలంకారాలు పాదుకలు, వెండిరథం ఆభరణాలు చేయిస్తున్నామని, రానున్న ఏడాది అమ్మవారికి 2కిలోల బంగారు చీరను తయారు చేయించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు