లంబాడీల ఆభరణాల తయారీకి ప్రోత్సాహం

16 Nov, 2013 05:09 IST|Sakshi

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్:  లంబాడీల సంప్రదాయ ఆభరణాల తయారీలో మరింత నైపుణ్యం పెరిగే విధంగా ఆ తెగ మహిళలకు ప్రత్యేక శిక్షణ తరగతుల ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. శుక్రవారం డిచ్‌పల్లి మండలం బీబీపూర్ పంచాయతీ పరిధిలోని అవుసుల తండాను కలెక్టర్  సందర్శించారు. తండాలో జర్మన్ సిల్వర్‌తో ఆభరణా లు తయారీ, రంగు రంగుల దారాలతో, వివిధ సైజుల అద్దాలు పెట్టి తయారు చేసే లంబాడీల సంప్రదాయ దుస్తులు, వస్తువులను ఆయన పరిశీలించారు. తయారీ విధానం, తయారీకయ్యే ఖర్చు, వినియోగం, వాటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయ వివరాలను లంబాడీ మహిళలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమాజం ఆధునికంగా మారడం, మార్కెట్లలో అతి తక్కువ ధరకే రోల్డ్‌గోల్డ్ వస్తువులు, వివిధ రకాల ఆభరణాలు లభిస్తుండటం వల్ల తాము తయారు చేసిన వస్తువులను కొనేవారు తగ్గిపోయారని లంబాడీ మహిళలు కలెక్టర్‌కు వివరించారు.
 
 ఎలాంటి యం త్ర పరికరాలు ఉపయోగించకుండా పూర్తిగా జర్మన్ సిల్వర్ ఆభరణాలను స్వయంగా తయారు చేస్తామని ఒక్కో రకం ఆభరణ ం తయారు చేసేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందన్నారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి సంప్రదాయ ఆభరణాలు, గిరిజన మహిళలు వివిధ వేడుకల్లో ధరించే దుస్తులు, వస్తువులు తయారు చేస్తున్నామని తెలిపారు. ఇదే తమ కులవృత్తిగా మారిందన్నారు. ఆభరణాలు తయారు చేయ డం వల్లనే తమ తండాకు అవుసుల తండా అనే  పేరు వచ్చిందన్నారు. తయారు చేసిన ఆభరణాలు, దుస్తులు, వస్తువులన జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగే వారాంతపు సంతల్లో అమ్ముకుని బతుకు బండిని లాగిస్తున్నామని తెలిపా రు. వరంగల్‌లో జరిగే సమ్మక్క - సారక్క జాత ర సమయంలో అక్కడికి వెళ్లి తాము తయారు చేసిన ఆభరణాలు, దుస్తులు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. ఇటీవలే కొందరు సీసీ పరిశ్రమ వారు తమ ఆభరణాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
 
 రాష్ర్టంలోని వివిధ ప్రాం తాలు, ఇతర రాష్ట్రాల్లో తాము తయారు చేసిన సంప్రదాయ ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువులను ప్రదర్శించే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకారం అందించాలని కోరా రు. తద్వారా తాము తయారు చేసే  వస్తువులు, ఆభరణాలకు మంచి ధర లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశముంటుందన్నారు. జిల్లాలో బాన్సువాడ, నిజాంసాగర్, గాంధారి మండలాల్లో మరో మూడు తండాల్లో గిరిజన సాంప్రదాయ ఆభరణాలు తయారు చేస్తారని కలెక్టర్‌కు ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) వెంకటేశం తెలిపారు. అయితే ఆయా తండాల్లో కేవలం రెండు మూడు కుటుంబాల వారు మాత్రమే ఆభరణాలు తయారు చేస్తారని, డిచ్‌పల్లి అవుసుల తండాలో మాత్రం తం డాలోని అన్ని కుటుంబాలు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాయని వివరించారు.  తండా వాసులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఐకేపీ ఆధ్వర్యంలో రూ.కోటి విలువ గల ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గిరిజన సంప్రదా య ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువులు తయారు చేయడంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా గృహోపకరణాల తయారీ, వృత్తి నైపుణ్యాల పెంపులో నూతన విధానాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు.
 
 గృహ అవసరాలను వినియోగించుకుంటూ, తయారు చేసిన వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించడం, దేశ, విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సాహాన్ని కల్పించడం తదితర చర్యలు తీసుకుం టామని తెలిపారు.  ఇందు కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్‌కు వివరిం చారు. ప్రభుత్వం ద్వారా తగిన సహాయ, సహకారాలు అందజేసేందుకు అన్నివిధాల కృషి చేస్తామని కలెక్టర్ తండా వాసుకులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట విశ్రాంత ఐఏఎస్ అధికారి మనోహర్ ప్రసాద్, తహశీల్దార్ వెంకట య్య,  సర్పంచ్ సుందర్, డ్వాక్రా బజార్ ఈవో భాగ్యరేఖ,డీపీఎం ప్రసాద్‌రావు,  ఏపీఎం అనిల్‌కుమార్, గిరి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు