భూముల ధరలకు మళ్లీ రెక్కలు

16 Sep, 2014 01:12 IST|Sakshi
భూముల ధరలకు మళ్లీ రెక్కలు
అమరావతి
 వైకుంఠపురంలో రాష్ట్ర అసెంబ్లీ భవనం, ధరణికోటలో సెక్రటేరియెట్, అమరావతి అగ్రి కల్చరల్ ఫారంలో వ్యవసాయ యూనివర్సిటీ, మండలానికి దగ్గరగా  ఔటర్ రింగ్ రోడ్డు... ఇలా రోజుకో ప్రతిపాదన కొత్తరాజధాని తెరపైకి వస్తుండడంతో మండల పరిధిలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి.
  నిన్నటి మొన్నటి వరకు  మండల కేంద్రమైన అమరావతిలో విజయ వాడ-గుంటూరు రోడ్డులో భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయి. అమరావతిని స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రావటంతో తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగం పుంజుకుంది.
  మొన్నటి వరకు విజయవాడ-గుంటూరు రోడ్డు పక్కన ఎకరం కోటి రూపాయల ధర పలకగా, నేడు  రెండు రూ. కోట్లకు పెంచారు.
  వాగుల పరివాహక ప్రాంతంలో వర్షాకాలంలో నీట మునిగే భూములను ఎకరా 30 నుండి 40 లక్షల రూపాయలు చెబుతున్నారు.
  ఔటర్ రింగ్ రోడ్డుపై స్పష్టత రావటంతో మండల పరిధిలో  వైకుం ఠపురం, పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, 14వ మై లు ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి.
  కృష్ణానదికి రెండువైపుల రాజధాని నిర్మాణ జరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో అమరావతి, ధరణికోట, దిడుగు, మల్లాది, మునగోడు వంటి నది పరివాహక భూములకు డిమాండ్ పెరిగింది.
  అమరావతికి పక్కనే ఉన్న తుళ్లూరు, తాడికొండ మండలాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వెలువడటంతో ఈ మూడు మండలాల్లో భూములకు విపరీతంగా ధర పెరిగింది. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో  రైతులు ప్రస్తుతం భూముల అమ్మకానికి మొగ్గు చూపటం లేదు.
 ప్రభుత్వ భూముల గుర్తింపు..
  {పభుత్వం ఆర్‌డివో స్థాయి అధికారిని నియమించి మండల పరిధిలో  పోరంబోకు, అసైన్డ్, అటవీ, చెరువు, కుంటలకు సంబంధించిన భూములను  క్షుణ్ణంగా పరిశీలించి వాటి వివరాలు సేకరించటం ప్రారంభించింది.
  మండలంలో ఏదో ఒక రంగానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో కొందరు ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుం టే, లేఅవుట్ల ద్వారా వేసిన ప్లాట్ల అమ్మకాలు ఇక్కడ మందకొడిగా సాగుతు న్నాయి. నిబంధనలు పాటించని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు వెనుకాడుతున్నారు.
 
 
 

 

మరిన్ని వార్తలు