తిమింగలాలను తప్పిస్తారా

6 Jun, 2017 00:58 IST|Sakshi

విచారణ తూతూ మంత్రమేనా?
lవిశాఖ భూ కుంభకోణం విచారణపై బాధితుల్లో అనుమానాలు


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూ కబ్జాల్లో భారీ తిమింగలాలను తప్పిస్తారా? విచారణ తూతూ మం త్రమేనా? ఇప్పుడు విశాఖ జిల్లా వాసుల్లో ఇవే సందేహాలు. విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్‌పై ఈనెల 15న ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో విశాఖ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయి తే దీనిపై ప్రజల్లో పలు సందేహాలు వెల్లువెత్తాయి. టీడీపీ పెద్దలను గట్టున పడేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల వ్యవహారశైలి కూడా అనుమానాలు బలపడే విధంగానే ఉన్నాయి.

రికార్డుల ట్యాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులపై అధికార యం త్రాంగం అత్యంత రహస్యంగా వ్యవహరిస్తోంది. వచ్చిన ఫిర్యాదుల్లో ఏ ఒక్కటీ బహిర్గతపరచొద్దంటూ భూముల కుంభకోణం వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కమాం డ్‌ కంట్రోల్‌ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ నెల 15న జరిగే బహిరంగ విచారణపై బాధితుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందా లేదా అనే ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగ రం.. దాని చుట్టుపక్కల గ్రామీణ మండలాల్లో భారీ ఎత్తున జరిగిన రికార్డుల ట్యాంపరింగ్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. డిప్యూటీì కలెక్టర్‌ పర్యవేక్షణలో తహసీల్దారు నేతృత్వంలో మే నెల 15 నుంచి 20 వరకూ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఐదు రోజుల్లో మధురవాడ నుంచి 25, కొమ్మాది నుంచి 5 ఫిర్యాదులు అందా యి. ఫిర్యాదుల వివరాల కోసం కమాండ్‌ కంట్రోల్‌ అధికారులను సాక్షి సంప్రదించగా..వివరాలు బహిర్గత పరచొద్దని ఆదేశాలున్నాయని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు