'గూగుల్ మ్యాపింగ్ తో భూములు గుర్తింపు'

4 Feb, 2015 20:50 IST|Sakshi
'గూగుల్ మ్యాపింగ్ తో భూములు గుర్తింపు'

హైదరాబాద్: గ్రామకంఠం, భూదాన భూములు, అసైన్డ్ భూముల వివరాలు గూగుల్ మ్యాపింగ్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గ్రామకంఠం భూమిని ఇప్పడు అనుభవిస్తున్న వారికే ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు.

అసైన్డ్ భూములు ఒకరి పేరు మీద ఉండి వేరేవారు అనుభవిస్తే ఆ భూములను వెనక్కుతీసుకునే అంశాన్న పరిశీలిస్తున్నామన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఢిల్లీలో తమ ఎంపీలు చేయాల్సిందంతా చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు