ఎట్టకేలకు లాసెట్ కౌన్సెలింగ్

6 Sep, 2015 01:03 IST|Sakshi

 ఎచ్చెర్ల: ఎట్టకేలకు లాసెట్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదలైంది. ఐదేళ్లు, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 8 నుంచి కౌన్సెలింగ్ నిర్విహ ంచనున్నారు. రాష్ట్రంలో ఐదు కౌన్సెలింగ్ సహాయ కేంద్రాలు ఏర్పాటుచేయగా, జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ నెల 8వ తేదీన 1 నుంచి 3 వేల ర్యాంకు మధ్య మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ విద్యార్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులు 10,11 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 3001 నుంచి చివరి ర్యాంకు వరకు 9న ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. విద్యార్థులు 11, 12 తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పీజీ కోర్సుకు సంబంధించి 10న ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. 12,13వ తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. న్యాయవిద్య కోర్సులో ప్రవేశ ఫీజు ఓసీ, బీసీలకు రూ.900, ఎస్సీ, ఎస్టీలకు రూ.450గా నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీ.... స్పోర్ట్సు, క్యాప్, ఎన్‌ఎస్‌ఎస్, ఫిజికల్ చాలెంజ్‌డ్ విద్యార్థులు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే సహాయ కేంద్రానికి హాజరుకావాల్సి ఉంటుంది.
 
 జిల్లాలో లా సీట్లు ఇలా..
 జిల్లాలోని బీఆర్‌ఏయూలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 60 సీట్లు, ఎల్‌ఎల్‌ఎంలో 20 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎంపీఆర్ లా కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 60, ఐదేళ్ల ఎల్‌ఎల్‌ఎంలో 60 సీట్లు ఉన్నాయి. జిల్లాలో లాసెట్ రాసిన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 155 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 133 మంది హాజరయ్యారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి 38 మంది దరఖాస్తు చేసుకోగా 31 మంది పరీక్ష రాశారు. ఎల్‌ఎల్‌ఎంకు సంబంధించి విశాఖపట్నంలో పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం నిరీక్షిస్తున్నారు.
 కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి లా సెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, పదోతరగతి, ఇంటర్, డిగ్రీ ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒరిజినల్స్, మూడుసెట్ల జిరాక్సు కాపీలతో విద్యార్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరుకావాలి.
 
 షెడ్యూల్ మేరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన
 బీఆర్‌ఏయూలో షెడ్యూల్ మేరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ ఎల్‌ఎల్‌ఎం సెట్ రాసిన విద్యార్థులు ర్యాంకు మేరకు ఆయా తేదీల్లో హాజరుకావాలి. ధ్రువీకరణ పత్రాలు పరిశీలన తరువాత షెడ్యూల్ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సీటు ఎలాట్‌మెంట్ వివరాలు సెల్ నంబర్‌కు మెసెజ్ వస్తుంది.


 - డాక్టర్ కె.కృష్ణమూర్తి,
 న్యాయ విభాగం కోర్సు కోఆర్డినేటర్, బీఆర్‌ఏయూ

మరిన్ని వార్తలు