ఓటు నమోదుకు మరో అవకాశం

23 Feb, 2019 12:59 IST|Sakshi
ఓటర్ల అవగాహన కోసం ఏర్పాటు చేసిన రంగోళి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న జేసీ నాగలక్ష్మి

23, 24 తేదీల్లో మార్పులు, చేర్పులు

జేసీ నాగలక్ష్మి

ఒంగోలు అర్బన్‌: ఓటు నమోదు, మార్పులు–చేర్పులకు ఈ నెల 23, 24 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపెయిన్‌ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. స్థానిక ఏబీఎం కాలేజీ క్రీడా మైదానంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం మహిళలతో రంగోళి కార్యక్రమం నిర్వహించి ముగ్గులు వేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి ఓటరూ ఓటర్ల జాబితా, పోలింగ్‌ యంత్రాలపై అవగాహనతో ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలను అందిస్తారని తెలిపారు. ముగ్గుల పోటీల్లో 402 మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలు కె.సుబ్బలక్ష్మికి రూ. 5 వేలు, మణిమంజరికి రూ. 3 వేలు, ఎం.వెంకటలక్ష్మికి రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో  స్టెప్‌ సీఈఓ రవి, డీడీ లక్ష్మీసుధ, ఐసీడీఎస్‌ పీడీ విశాలక్ష్మి, డీఎస్‌డీఓ యతిరాజు, డీఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్‌లోపాల్గొనాలి
ప్లారమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టి పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య అన్నారు. ఈ మేరకు సీపిఓ కాన్ఫరెన్స్‌ హాలులో విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎంతమంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో గుర్తించి వారికి ప్రత్యేక ఏర్పాట్లతో ఓటు హక్కు వనియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. వారికి అవసరమైన వీల్‌ ఛైర్స్, వలంటర్లీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చూపులేని వారికోసం బ్రెయిలీ లిపి ద్వారా కూడా ఈవీఎంలతో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2019 ఎన్నికలు అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే నినాధంతో భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బి. శింగయ్య, సీపిఓ వెంకటేశ్వర్లు, టూరిజం అధికారి నాగభూషణం, స్టెప్‌ సిఈఓ రవి ఇతర అధికారలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు