నవ్వించడం ఓ వరం

18 Mar, 2018 13:10 IST|Sakshi
అప్పన్న సన్నిధిలో గీతాసింగ్,  సుమన్‌శెట్టి, చిట్టిబాబు తదితరులు 

అప్పన్నను దర్శించుకున్న హాస్య నటులు

సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్‌ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్‌శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్‌ టీం లీడర్‌ ఆనంద్‌లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్‌ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్‌శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. 

నెగిటివ్‌ రోల్స్‌ ఇష్టం : సుమన్‌శెట్టి
నెగిటివ్‌ రోల్స్‌ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్‌శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్‌పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్‌ పూర్ణామార్కెట్‌ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు