న్యాయవాదులకు ప్రాతినిధ్యం కల్పించండి

2 Oct, 2018 07:23 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న న్యాయవాదులు

విజయనగరం :విధాన పరిషత్‌లో న్యాయవాదులకు ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కేవీఎన్‌ తమ్మన్నశెట్టి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కంటుభుక్త శ్రీనివాసరావు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం కోరారు. యాత్ర జిల్లా కోర్టు సమీపంలోకి వచ్చే సరికి జగన్‌ వద్దకు చేరుకుని తమ సమస్యలను ఆయన ముందుంచారు. శాసనసభను, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి రప్పించి, హైకోర్టును మాత్రం ఇప్పటి వరకు తేలేకపోవడం చంద్రబాబునాయుడు వైఫల్యంగా చెప్పారు. అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమ నిధి రూ.4 లక్షల నుంచి 15లక్షలకు పెంచా లని కోరారు. హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బార్‌ కౌన్సిల్‌కు రూ. 100కోట్లు అందించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. జూనియర్‌ న్యాయవాదులు నిలదొక్కుకునేందుకు నెలకు రూ.5వేలు చొప్పున ఐదేళ్ల పాటు అందించేందుకు ఆలోచన చేయాలని కోరారు. వీటిపై జగన్‌ సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు