స్పీకర్‌ పర్యటనలో ఉద్రిక్తత

15 Feb, 2018 11:31 IST|Sakshi

సాక్షి, అనంతపురం : శాసనసభా స్పీకర్‌ కోడెల శివప్రసాద రావుకు అనంతపురంలో ఊహించని సంఘటన ఎదురైంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలం‍టూ న్యాయవాదులు ఆయన పర్యటనను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్‌ పర్యటలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం స్పీకర్ ను కలిసిన న్యాయవాదులు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాజధాని ఒక చోట పెడితే మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని వివరించారు. సీఎం చంద్రబాబు మరోసారి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

అయతే అంతకు ముందు న్యాయవాదుల ఆందోళనలపై ఎమ్మె‍ల్యే ప్రభాకర్‌ చౌదరి ఎదురుదాడికి దిగారు. వారితో వాగ్వాదానికి పాల్పడ్డారు. తమ డిమాండ్లను వినిపించడానికి వచ్చిన న్యాయవాదులపై ఘాటుగానే స్పందించారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. గత కొంతకాలంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు