నాయకుడు మూలాలు మరవకూడదు: దామోదర

18 Oct, 2013 18:49 IST|Sakshi
నాయకుడు మూలాలు మరవకూడదు: దామోదర
జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నవారే ప్రస్తుతం సమైక్యాంధ్ర కావాలని ఉద్యమిస్తున్నారని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. నిజమాబాద్ లో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నాయకుడు అనేవాడు మూడు ప్రాంతాలను ఒకే రకంగా చూసుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ లేకుంటే తాను లేనని.. ఏ నాయకుడైనా తన మూలాలను మర్చిపోకూడదు అని అన్నారు. 
 
నాయకులకు అహం, అహంకారం ఉండకూడదని అని అన్నారు. ప్రభుత్వానికి నేతృత్వం వహించే నాయకుడికి తెలంగాణకు వ్యతిరేకిని, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం అనే భావన ఉండకూడదు అని దామోదర హితవు పలికారు. 
 
అనేక సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన సీమాంధ్ర ప్రాంత నాయకులు ఏనాడైనా సమతూల్యం పాటించారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆక్రందనను కాంగ్రెస్ గుర్తించి.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది అని అన్నారు. 
 
సిద్దాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.  ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సత్తా కాంగ్రెస్ కే ఉంది అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న నేతలు 2004 లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నపుడు ఎందుకు మాట్టాడలేదని ప్రశ్నించారు. 
 
మరిన్ని వార్తలు