వైఎస్సార్‌ సీపీలో భారీగా చేరికలు

15 Nov, 2018 07:36 IST|Sakshi
పార్టీలో చేరిన వారికి కండువాలు వేసిన జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో  గత కొద్ది రోజులుగా  వివిధ పార్టీలకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకులు  రాజీనామాలు చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఇదే తరహాలో బుధవారం పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. జిల్లాలోని  పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలంలోని తామరఖండి వద్ద జరిగిన చేరికల్లో జగన్‌ వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో సీతానగరం మండలంలోని కోట సీతారామపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీ పీకే రత్నారావు, మాజీ సర్పంచ్‌ వి.కృష్ణమూర్తి, మాజీ పంచాయతీ ఉపా«ధ్యక్షులు వై.తిరుపతిరావు, మాజీ సర్పంచ్‌ బక్కు శ్రీదేవి, మాజీఎంపీటీసీ చుక్కా శకుంతలమ్మ, తామరఖండి మాజీ ఎంపీటీసీ వేగిరెడ్డి స్వామినాయుడు, ఆర్‌వెంకంపేట  మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పెం ట అప్పారావు, బలిజిపేట మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ సుభద్ర, ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ శంకరరావు, అరసాడ మాజీ ఎంపీటీసీ పోలా రామకృష్ణ, పాల సంఘం అధ్యక్షుడు కొల్లి సూర్యనారాయణ, నీటి సంఘం డైరెక్టర్‌ గుల్లిపల్లి  లక్ష్మణరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గుల్లిపల్లి ఈశ్వరరావు పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, బక్కు భవానీ, అల్లు సూర్యనారాయణ, గుంట ప్రకాష్, మూడడ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి..
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి వైఎస్సార్‌ సీపీలో బుధవారం చేరారు. పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలంలోని అప్పయ్యపేట వద్ద మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ఆ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పలువురు చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన పార్వతీపురం మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ దొడ్డి విజయకృష్ణ, మాజీ కౌన్సిలర్లు బత్తుల సూర్యారావు, బెహరా బాబ్జీ, పాత గౌరీశంకర్, వానపల్లి శంకరరావు, కోట్ల అప్పలనాయుడు, ముగడ జగన్మోహనరావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీకి చెందిన పార్వతీపురం మండలంలోని గోపాలపట్నం మాజీ సర్పంచ్‌ గవర కృష్ణమూర్తినాయుడు, బలిజిపేట మండలంలోని పదమాయవలస మాజీ సర్పంచ్‌ తట్టికోట పెదప్పలనాయుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు