ప్రేమించిన యువతితో గొడవపడి లెక్చరర్ ఆత్మహత్య

19 Oct, 2013 22:22 IST|Sakshi

హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లగా ప్రేమించిన యువతితో ఇంట్లో గొడవ పడిన ఓ లెక్చరర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.  గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జాలాది చెన్నకేశవరెడ్డి (33) మోతీనగర్ అవంతినగర్ తోటలో నివాసం ఉంటూ ఎస్‌ఆర్‌నగర్ శ్రీచైతన్య కళాశాలలో లె క్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం భ్యార్య గర్భవతి కావడంతో ప్రసవం కోసం నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.
 
 

కాగా ఆరు సంవత్సరాల క్రితం  చెన్నకేశవరెడ్డి  తను పనిచేస్తున్న కళాశాలలో చదువుకునే విద్యార్థినిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆమె బీ.టెక్ చదువకుంటుంది. శుక్రవారం రాత్రి ఆ యువతిని ఇంటికి పలిపించుకుని తనతో సరిగా ఉండటం లేదని  గొడవకు దిగాడు. ఇద్దరిమధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. ఆమె ముందే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో ఆమె చేతిరెండు వేళ్లకు గాయాలు అయ్యాయి. అనంతరం విషయాన్ని చెన్నకేశవరెడ్డి సోదరుడికి తెలుపింది. అతను వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశాడు . ఈ మేరకు  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు