సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

13 Aug, 2015 13:20 IST|Sakshi
సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన

పెనుకొండ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం నేతలు, సమాచార హక్కు ఐక్యవేదిక నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంవద్ద ధర్నా చేశారు. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు.

మరిన్ని వార్తలు