కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు

28 Jun, 2015 02:57 IST|Sakshi
కష్టకాలంలో రాజధాని ప్రాంత నిమ్మ రైతు

- కాపు సమయంలో చదును చేస్తారేమోనని ఆందోళన
- దిగుబడి పూర్తయ్యేవరకు నిలిపి వేయాలని విజ్ఞప్తి     
తాడికొండ:
అమరావతి రాజధాని ప్రాంత నిమ్మ తోటల రైతులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. కాపు మీద ఉన్న పంటను ప్రభుత్వం ఎక్కడ చదును చేస్తుందోనని భయపడుతున్నారు. తుళ్ళూరు మండలంలోని రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం కావటంతో దిగుబడి అధికంగా ఉంటుంది. రైతులు టన్నుల కొద్దీ పంటను రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి చేస్తున్నారు. మంచి సైజ్ ఉండటంతో మార్కెట్‌లో అధిక ధర కూడా పలుకుతోంది.

మరిన్ని వార్తలు