ప్రమాద ఘంటికలు

21 Feb, 2018 13:53 IST|Sakshi
జిల్లాలో కుష్టు వ్యాధి పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్,ఛైర్‌పర్సన్‌లతో మాట్లాడుతున్న అదనపు వైద్యాధికారి

జిల్లాలో పెరుగుతున్న కుష్టు వ్యాధిగ్రస్థులు

తాజాగా 343 కేసులు నమోదైనట్టు నిర్ధారణ

సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా చైతన్య కార్యక్రమాలకు నిర్ణయం

రాకూడదని కోరుకునే రోగం జడలు విప్పుతోంది.  కనుమరుగవుతోందనుకున్న కుష్టు వ్యాధి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు తేలింది. దేశమంతా తగ్గుముఖం పడుతుంటే... మన జిల్లాలో మాత్రం పెరగడం చర్చనీయాంశమైంది. గతేడాదే ఈ విషయాన్ని గుర్తించి కొన్ని నివారణా చర్యలు చేపట్టినప్పటికీ ఈ ఏడాది మరో నాలుగు జిల్లాలతో పాటు మన జిల్లా కూడా వ్యాధి ప్రబలుతున్న జిల్లాగా నమోదు కావడం యంత్రాంగాన్ని కలవరపెడుతోంది.

విజయనగరం, బొబ్బిలి: జిల్లాలో మళ్లీ కుష్టువ్యాధి ప్రబలుతోంది. ఒక్క ఈ ఏడాదే 343మంది వ్యాధిబారిన పడినట్టు గుర్తించారు. ఇందులో ఒక సంవత్సరం కోర్సు వాడితే తగ్గే వారు 128 మంది, ఆరునెలల పాటు కోర్సు వాడాల్సినవారు 161 మందిని గుర్తించారు. మొత్తంగా 289 మంది మందులు వాడాలని గుర్తించారు. మిగతా వారిని పరిశీలించాల్సి ఉంది. జిల్లాతో పాటు పొరుగునే ఉన్న శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో తేల్చా రు.

సరైన అవగాహన కార్యక్రమాలు, నివారణా చర్యలు చేపట్టకపోతే మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని గుర్తించింది. కేంద్రప్రభుత్వం అప్రమత్తమై సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా ఆయా జిల్లాల్లో ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది. దీని ప్రకారం జిల్లాలోని బొబ్బిలి తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు వైద్యాధికారులు పరిశీలనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకా రం చేపట్టిన సర్వే ప్రకారం అధికారికంగా జిల్లాలో 343 కేసులు ఉండగా వాస్తవానికి అవి వెయ్యి కి పైగా ఉండొచ్చనేది అంచనా! రోగుల్లో భ యం, అనుమానం, బిడియం వంటి కారణాలతో పాటు సాధారణ పనులకు ఆటంకం కలగక పోవడంతో వ్యాధిని గుర్తించి మందులు వాడట్లేదని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
కుష్టు వ్యాధి నివారణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆయా రోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటి స ర్వేలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడా చర్యలు కానరావడం లేదు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో కొన్నే ళ్ల కిందట కుష్టు వ్యాధి గుర్తింపు పరీక్షలు ప్రతీ గురువారం నిర్వహించేవారు. దీనివల్ల వ్యాధి అదుపులో ఉండేది. ఇప్పుడు ఆ పరీక్షలు లేవు. ప్రత్యేక విభాగాలు కాకుండా పీహెచ్‌సీల్లోని ఏఎన్‌ఎంలకే కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వదిలేస్తున్నారు. అవి రోగ నివారణకు ఏమాత్రం ఉపయోగపడటంలేదు.

ఖాళీ పోస్టుల భర్తీ లేదు
జిల్లాలో 12 డీపీఎంల పోస్టుల పరిధిలో నాలుగు ఏపీఎంఓ పోస్టులు ఉండేవి. ఇప్పుడు ఆయా పోస్టుల్లో ఉన్న వారు పదవీ విరమణ చేస్తున్నా వాటిని భర్తీ చేయడంలో చొరవ చూపడంలేదు. గతంలో కుష్టు వ్యాధి నిర్మూలన కేంద్రాల్లో పలు సేవలందేవి. ఇప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా సేవలు మృగ్యమయ్యాయి.

జిల్లా అధికారుల పరిశీలన: బొబ్బిలిలోని అభిమాని ఫౌండేషన్‌ ద్వారా కుష్టువ్యాధిపై అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించేం దుకు వైద్యాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వైద్యాధికారులు బొబ్బిలిలో పరిశీలించారు. అదనపు వైద్యాధికారి ఎస్‌.రవికుమార్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అచ్యుతవల్లి, కమిషనర్‌ శంకరరావు, స్థానిక వైద్యాధికారి విజయమోహన్‌తో చర్చించారు. ర్యాలీ, అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలియజేశారు.

మరిన్ని వార్తలు