-

స్కూళ్లకు కత్తెర

29 Jul, 2015 03:36 IST|Sakshi
స్కూళ్లకు కత్తెర

- జిల్లాలో 743పాఠశాలల రద్దు
- రేషనలైజేషన్ పేరుతో వేటు
- దూరాభారమైనా మరో స్కూలుకు వెళ్లాల్సిందే
- లేకుంటే ప్రయివేటు బాట తప్పదు
- చాపకిందనీరుగా సర్కారు చర్యలు
ప్రాథమిక విద్య పిల్లలకు భవిష్యత్‌కు తొలి అడుగు. దానిని మెల్లగా వారికి దూరం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. చదువు అవసరమైతే దూరమైనా వెళ్లాల్సిందేనంటోంది. లేదంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకోండంటూ పరోక్షంగా రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలల సంఖ్యను కుదించేందుకు సిద్ధమైంది.
 
విశాఖ ఎడ్యుకేషన్:
చాలా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధులు సంఖ్య తక్కువగాఉన్న పాఠశాలలను రద్దు చేసి వారిని సమీపంలో పాఠశాలకు తరలించం రేషనలైజేషన్ ప్రకియ. ఈ ప్రక్రియ ద్వారా పాఠశాలలను తగ్గించి అన్నింటిని సక్సెస్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాట. ఇప్పటికే ప్రభుత్వం రేషనలైజేషనుకు శ్రీకారం చుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను రద్దుచేసేందుకు పావులు కదుపుతోంది. సుమారు 743 పాఠశాలలను ఇలా పక్క సూళ్లలో విలీనం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను రహస్యంగా చేసుకుపోతోంది. రేషనలైజేషన్ ప్రకియపై తొలుత ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
 
దాని ద్వారా నిబంధనలను సిద్ధం చేయించింది. కమిటీ నిబంధనల ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 20లోపు, 6,7 తరగతుల వరకు ఉన్న యూపీ స్కూల్స్‌లో 35 లోపు, 6,7,8 తరగతుల్లో 50 లోపు విద్యార్ధులు ఉంటే వాటిని వేరే స్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు తయారు చేసింది. దీని ఆధారంగా విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించారు. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
 
భాష పండితులపై నిర్లక్ష్యం..

ఓ వైపు రేషనలైజేషన్ ప్రకియలో తగ్గించుకుంటూ సక్సెస్ పాఠశాలల సంఖ్య పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరిట ప్రక్రియల  భాషా పండితుల సంఖ్యను కుదిస్తోంది. ఇతర సంబ్జెక్టులకు 3 నుంచి 5 మంది ఉపాధ్యాయులను ఉంచుతూ ఎంత మంది విద్యార్ధులైనా  భాషా పండితులను మాత్రం ఒక్కరినే ఉంచుతుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలు పెట్టి విద్యార్ధుల సంఖ్య పెరగడంతో భాషా పండితులు సంఖ్య అదనంగా అవసరమైన ఒక్కో సబ్జెక్టుకు ఒక్కరినే పరిమితం చేస్తుంది. ఫలితంగా ఉపాధ్యాయులు సామర్ధ్యానికి మించి తరగతులు బోధించాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు