ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు

14 Nov, 2013 01:27 IST|Sakshi

వేములపల్లి, న్యూస్‌లైన్:  ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాల యాలను ఏర్పాటుచేయాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. గ్రంథాల య సంస్థ, ప్రాథమిక విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాట్లకు సిద్ధపడింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మేధాశక్తి, పుస్తక పఠనం, దేశభక్తి పెంపొందించేందు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలల ది నోత్సవం సందర్భంగా గురువారం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించనున్నా రు. ప్రాథమిక విద్యాశాఖ ఆదేశాల ప్రకారం 200 మంది విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలను గ్రం థాలయం ఏర్పాటుకు ఎంపిక చేయాల్సి ఉంది.
అలా విద్యార్థులు లేకుంటే జిల్లాకు 50 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయా ల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో మొదటి విడతగా 23 పాఠశాలలను ఎంపిక చేశా రు. మిగిలిన పాఠశాలలను దశల వారీగా ఎంపిక చేయనున్నారు. గ్రంథాలయాల్లో పిల్లలకు ఉపయోగపడే దేశభక్తి, మహానీ యుల చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, బాలల సాహిత్యం, నీతి కథలు, సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతోపాటు ప్రముఖ దినపత్రికలను ఏర్పాటు చేస్తారు.
 ప్రత్యేక పిరియడ్
 విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాల్లో పుస్తక పఠనానికి ప్రత్యేక పిరియడ్‌ను కేటాయిస్తారు. ఈ పిరియడ్‌కు ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమిస్తారు. గ్రంథాలయ ఉపాధ్యాయుడు సమీప గ్రంథాలయం నుంచి 15 రోజులకొకసారి 100 నుంచి 200 రకాల పుస్తకాలను తీసుకొచ్చి విద్యార్థులతో చదివించాల్సి ఉంటుంది.
 జిల్లాలో ఎంపికైన పాఠశాలలు
 జిల్లాలో మొదటి విడతగా 23 ప్రాథమిక పాఠశాలలను గ్రంథాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశారు. అనుముల మండలం అనుముల, చందంపేట మండలం పెద్దమునిగల్, కంబాలపల్లి, చండూరు మండలం బోడంగిపర్తి, చివ్వెంల మండలం కుడకుడ, చందుపట్ల, దేవరకొండ మండలం తాటికోలు, డిండి మండలం తవక్లాపూర్, అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కట్టంగూర్ మండలం చెర్వుఅన్నా రం, మర్రిగూడ మండలం శివన్నగూడెం, మఠంపల్లి మండలం వరదాపురం, పెదవీడు, మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి, ఆలగడప, పీఏపల్లి మండలం వడ్డిపట్ల, పెద్దవూర మండలం పులిచర్ల, రామన్నపేట మండలం వెల్లంకి, సూర్యాపేట మండలం బాలెంల, టేకుమట్ల, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి, తుంగతుర్తి మండలం గొట్టిపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు