ప్రకటనలకే పరిమితం..

22 Mar, 2018 12:28 IST|Sakshi
దేవుపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

∙పెరగని ‘ఉపాధి’ పనిదినాలు

∙ఇబ్బంది పడుతున్న వేతనదారులు

బొండపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడానికి... వలసల నివారణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ మొదట్లో వంద రోజుల పని కల్పించాలని నిర్ణయించారు. తర్వాత 150 పని దినాలను కల్పిస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పించారు. దీంతో వేతనదారులు ఎంతో సంతోషించారు. అయితే టీడీపీ సర్కార్‌ పథకం అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వేతనదారులకు కూడా 150 రోజుల పని కల్పించలేకపోయారు. దీంతో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారు పనికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. 150 రోజుల ఉపాధి పని ప్రకటనలకే పరిమితం కావడంతో వేతనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 16,452 వేతనదారులు జాబ్‌కార్డులు కలిగి ఉండగా వీరంతా పనులకు వెళ్తున్నారు. వీరిలో సుమారు పది వేల మంది వంద రోజుల పని పూర్తి  చేసుకోగా... మిగిలిన వారు వంద రోజుల పని కూడా పూర్తి చేసుకోలేదు.  వంద రోజుల పని పూర్తి చేసుకున్న వారు తమకు 150 రోజుల పని కల్పించాలని కోరుతుండగా, మిగిలిన వారు ప్రస్తుతం పనులకు వెళ్తున్నారు. 
అందని బిల్లులు
అనుకున్న ప్రకారం పనులు కల్పించలేని అధికారులు మరో పక్క చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నారు. మండలంలోని దేవుపల్లి, బొండపల్లి, గ్రహపతిఅగ్రహారం, ఎం. కొత్తవలస, బి.రాజేరు, సీటీపల్లి, మరువాడ, జే గుమడాం, వెదురువాడ, ఒంపల్లి, కొండకిండాం, రాచకిండాం, కనిమెరక, రయింద్రం, గరుడబిల్లి, గొట్లాం, ముద్దూరు, నెలివాడ, గొల్లుపాలెం, తదితర గ్రామాల్లో ఎక్కువ మంది వేతనదారులు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. ఇందులో చాలా గ్రామాలకు చెందిన వేతనదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు కల్పించడం లేదని, అలాగే చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు చేయడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించడంతో పాటు పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని వేతనదారులు కోరుతున్నారు. 

 కరువు మండలాల్లోనే..

కరువు మండలాల్లోనే 150 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారు. బొండపల్లి మండలంలో 100 రోజులు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కూడా 100 రోజులు పనిదినాలే కల్పిస్తున్నాం.
 కె.రవిబాబు,ఏపీఓ,బొండపల్లి మండలం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు

బంకుల్లో నిలువు దోపిడీ.!

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

ముస్లిం మైనార్టీలకు ఏకైక శత్రువు కాంగ్రెస్సే

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

నగదు వసూలు చేస్తే జైలుకే

ఎంపికైతే ఏం చేస్తారు?

గ్యాస్‌ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది

రాజాంలో దొంగల హల్‌చల్‌

దెయ్యం.. ఒట్టి బూటకం 

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

బీహార్‌ దొంగల బీభత్సం

బది'లీలలు' ఏమిటో..?

జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే

సిరా ఆరకముందే 80% హామీల అమలు

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘సదావర్తి’పై విజిలెన్స్‌ విచారణ

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం

‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం

లంచాలు లేకుండా పనులు జరగాలి

‘కాపు’ కాస్తాం

ఏపీ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు తీరు ఇంకా మారలేదు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను