టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం

8 Jun, 2020 08:50 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న టీడీపీ నేతకు చెందిన విజయ పాల వ్యాన్‌

పోలీసుల తనిఖీల్లో ఉయ్యూరులో పట్టుబడిన వైనం 

50 క్వార్టర్లు, 5 ఫుల్‌ బాటిళ్లు స్వాధీనం 

ముగ్గురు నిందితుల అరెస్ట్‌ 

వ్యాన్‌ యజమాని  రాజా మాజీ ఎమ్మెల్యే బోడె సన్నిహితుడు

సాక్షి, ఉయ్యూరు(పెనమలూరు): టీడీపీ నేతకు చెందిన విజయ పాల వ్యాన్‌లో అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలు దొరకడంతో పాల వ్యాపారం మాటున అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. పట్టుబడిన వ్యాన్‌ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సన్నిహితుడైన కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాది కావడం, ఆయన విజయ పాల సరఫరాకు కాంట్రాక్ట్‌ పద్ధతిపై వ్యాన్‌ తిప్పుతుండంతో అక్రమ మద్యం వ్యాపారం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడపీ నేత పాలవ్యాన్‌లో లిక్కర్‌ బాటిళ్లు తరలిస్తున్నారు

మద్యం సీజ్‌.. ముగ్గురు అరెస్ట్‌ 
విజయ పాల డెయిరీలో అక్రమ మద్యం సీసాలు పట్టుబడిన వైనం సంచలనమైంది. అవనిగడ్డ నుంచి వస్తున్న పాల వ్యాన్‌లో 50 క్వార్టర్‌ మద్యం బాటిళ్లు, 5 ఫుల్‌ బాటిళ్లు సంచిలో మూటగట్టి ఉన్నాయి. ఆదివారం ఉయ్యూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో పాల వ్యాన్‌లో మద్యం ఇవి బయటపడ్డాయి. సీఐ నాగప్రసాద్, ఎస్‌ఐ గురుప్రకాష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మద్యం బాటిళ్లను స్వా«దీనం చేసుకుని పాల వ్యాన్‌ను సీజ్‌ చేసి క్యాషియర్‌ పాలేపు గుప్తా, సిబ్బంది పట్టాభిరావు, వికాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్‌ కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాదిగా గుర్తించారు. రాజా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు 

కాంట్రాక్ట్‌ రద్దుచేసిన విజయ డెయిరీ 
చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): విజయ పాల వ్యాన్‌లో మద్యం తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై సదరు సంస్థ చర్యలు తీసుకుంది. ఉయ్యూరులో విజయ పాల వ్యాన్‌లో మద్యం రవాణా చేస్తున్న ఘటనపై విజయ డెయిరీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈశ్వర్‌బాబు స్పందించారు. పాల వ్యాన్‌ను  నడుపుతున్న  వై. రాజా కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాల వ్యాన్‌లను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జేఎండీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు