మత్తు దించుతాం

20 Mar, 2016 05:42 IST|Sakshi
మత్తు దించుతాం

సారా తయారీఅడ్డుకట్టకు సన్నాహాలు
గంజాయి సాగు నిరోధానికి కార్యాచరణ
డిఫెన్స్, విదేశీ మద్యంఅక్రమ నిల్వలపై దాడులు
‘సాక్షి’తో ఎక్సైజ్ డీసీ గోపాలకృష్ణ

 
సాక్షి: తెలంగాణ నుంచి ఆంధ్ర కేడర్‌కు రావడం ఎలా ఉంది?
డీసీ: ఆంధ్ర నా సొంత ప్రాంతం. విశాఖలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది.
సాక్షి: జిల్లాలో సారా జోరు ఎక్కువగా ఉంది...?
డీసీ: అవును. బాధ్యతలు చేపట్టగానే తొలుత సారాను అరికట్టే అంశాన్నే తీసుకున్నాను. రాష్ర్ట ప్రభుత్వం దీని నియంత్రణకు ‘నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో సారా తయారీని అడ్డుకుంటాం. ము ఖ్యంగా అనకాపల్లి డివిజన్‌లో 243 గ్రామాల్లో సారా తయారు చేస్తున్నట్టు గుర్తిం చాం. 22 గ్రామాల్లో ఉధృతంగా ఉంది. అంచెలంచెలుగా దాడులు చేపడతాం.

సాక్షి: గంజాయి సాగు, అక్రమ రవాణాకు విశాఖ ఏజెన్సీ ప్రధాన కేంద్రంగా మారిందనే వాదన ఉంది?
డీసీ: సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సాగయ్యే గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఏజెన్సీలో గంజాయి సాగు విస్తరించింది. వరంగల్ వంటి తెలంగాణ జిల్లాల్లోనే ఉండే గంజాయి సాగు జిల్లాకు విస్తరించడానికి కూడా ఇదే కారణం. దీని రవాణాను ఎంతగా అడ్డుకున్నా అది తక్కువే అవుతుంది. పంట సాగును నిరోధిస్తేనే ఫలితం ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇక్కడికి వచ్చి గిరిజనుల చేత పండిస్తున్నారు. వారిని పట్టుకోవాలి. ముఖ్యంగా పంట వేయకుండా ఉండాలంటే గిరిజనులకు గంజాయి విత్తనాలు దొరక్కుండా చేయాలి. ఇందుకు పోలీస్, ఫారెస్ట్, ఐటిడీఎ, ఎక్సైజ్ శాఖలో సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. మే నుంచి కొత్త పంట సాగు ప్రారంభమవుతుంది. ఈలోగా అన్ని విభాగా సమన్వయంతో అడ్డుకోవడానికి కార్యాచరణ మొదలుపెడతాం.

సాక్షి: మద్యం దుకాణాలు నిబంధనలు పాటించేలా తీసుకుంటున్న చర్యలేమిటి?
డీసీ: లెసైన్స్ కలిగిన మద్యం షాపులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నాం. అయితే అది తక్కువగా ఉంటోంది. జరిమానా మొత్తాన్ని పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం. ఎక్కువ జరిమానా పడుతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అదే విధంగా విదేశీ, డిఫెన్స్ మద్యం అక్రమ నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి. డిఫెన్స్ మద్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని బ్రాండ్ల విదేశీ మద్యాన్ని మా ఏపీపీసీఎల్‌లో అందిస్తున్నాం.

మరిన్ని వార్తలు