మేలుజాతి పశువులపైనే రైతుల దృష్టి

3 Jun, 2014 01:33 IST|Sakshi
  • పశువుల ఉత్పత్తిపై శిక్షణ
  •   గ్రామానికి 80 నుంచి 100  పశువుల ఎంపిక
  •   పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాసరావు
  •  చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:  జిల్లాలోని రైతులు పాడి పరిశ్రమతో పాటు మేలుజాతి పశువుల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడం తో ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్న ట్టు పశుసంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యాలయంలోని తన చాంబర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    ధరకు ప్రాధాన్యతను పక్కనపెట్టి మేలుజాతి పశువుల కొనుగోలుపై పాడి రైతులు మొగ్గు చూపుతున్నట్టు ఇటీవల నిర్వహించి న ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే పాడి పశువుల ఉత్పత్తిని పెంచనున్నట్టు ఆయన తెలిపారు. దూడకు దూడకు మధ్య కాలాన్ని 14 నెలలకు కుదించి ఎదకట్టే పశువుల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపర్చడంతో పాటు పశువుల ను ఉత్పత్తి చేస్తామన్నారు. పశువుల కు ఎదకట్టించే విషయంలో శాఖలోని 140 మంది పశువైద్యాధికారులకు, 150 మంది పారావిట్‌లకు, 400 మంది గోపాలమిత్రలకు ప్రత్యేక శిక్ష ణ ఇచ్చామన్నారు.

    తొలుతగా పెలైట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 500 గ్రా మాల్లో మేలుజాతి పశు ఉత్పత్తి చేపడతామన్నారు. ప్రతి గ్రామంలోనూ 80 నుంచి 100 ఆవులను ఎంపిక చేసి వాటి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఎద కట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నా రు. దూడను ఈనిన ఆవు రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఎదకట్టేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలి పారు. ఈ కార్యక్రమం ద్వారా పశు ఉత్పత్తే కాకుండా పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.

    ప్రస్తుతం శాఖలోని అన్ని పథకాలు వీటికి వర్తింప చేస్తామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో పశు ఉత్పాదకత 40గా ఉంటే దాన్ని 70 నుంచి 80కి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ పశువులకు గర్భకోశ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద పశువుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దీంతో పాటు తగిన వైద్యం, మందు లు ఇస్తామన్నారు.

    ఎదకట్టేందకు ఎంపిక చేసిన పశువులకు వాటర్‌షెడ్ పథకం కింద చేకూరే లబ్దిని కూడా ఈ కార్యక్రమానికి మళ్లిస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల సాయంతో ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసి పశుగణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. దీని ద్వారా పాల ఉత్పత్తి పెంచడం ద్వారా పాడిరైతులకు లాభసాటిగా ఉండేందుకు మినీ డెయిరీ పథకాన్ని సైతం వర్తిం ప చేస్తామన్నారు. ఆసక్తిగల పాడిరైతులు మేలుజాతి పశుగణాభివృద్ధిలో భాగస్వాములు కావచ్చని ఆయన పిలుపునిచ్చారు.
     

మరిన్ని వార్తలు