నేటి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా !

17 Sep, 2018 12:25 IST|Sakshi

రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నేటి నుంచి 23వ తేదీ వరకు మళ్లీ ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్‌ లైసెన్సులు జారీ చేస్తారు. స్పాట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని డీటీసీ మీరాప్రసాద్‌ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయవాడ: రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈనెల 23 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున 15 గ్రామాల్లో లెర్నింగ్‌ లైసెన్స్‌లు జారీ చేసేందుకు మేళాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా  డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఇ.మీరాప్రసాద్‌ తెలిపారు. స్పాట్‌లో ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌లు బుక్‌ చేసేందుకు రవాణా శాఖ ద్వారా  ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.  ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

మేళాలు నిర్వహించే గ్రామాలు..
17న పెనమలూరు మండలం యనమలకుదురు, విజయవాడలోని రామకృష్ణాపురం, 18న కంకిపాడు మండలం తెన్నేరు, మంతెన, 19న జి.కొండూరు మండలం కవులూరు, 20న గన్నవరం, పెనమలూరు, 21న జి.కొండూరు మండలం వెలగలేరు, విజయవాడ రూరల్‌ మండలం నున్న, 22న గణపవరం, పెనమలూరు మండలం గోసాల, 23న విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి, జి.కొండూరు మండలం వెల్లటూరులో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహిస్తారు.

అర్హతలు ఇవి..
18 ఏళ్లు వయస్సు పూర్తయిన సర్టిఫికెట్‌ ఉండాలి.
ఆధార్‌ కార్డు జత చేయాలి.
ఒక పాస్‌పోస్టు సైజు పోర్టు అవసరం.
50ఏళ్లు, ఆపైబడిన వయస్సు ఉన్న వారు ఫారం 1ఏతో మెడికల్‌ సర్టిఫికెట్‌ జతచేయాలి.
బైక్, కారులో ఒక  దానికి రూ. 260లు, రెండింటికి కలిపి రూ. 410లు ఎల్‌ఎల్‌ఆర్‌ ఫీజు చెల్లించాలి.

మరిన్ని వార్తలు