స్థానిక ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండమే: గండ్ర

16 Jul, 2013 18:14 IST|Sakshi
గండ్ర వెంకటరమణారెడ్డి

పార్టీ గుర్తులపై జరగనున్న మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండమేనని ప్రభుత్వ చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. చిన్నరాష్ట్రాలతో నక్సల్స్ సమస్య వస్తుందనే వాదన సరికాదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిపైనే మావోయిస్టులు దాడి చేసిన వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు. కేరళ వంటి చిన్న రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య లేదని తెలిపారు.

రాష్ట్ర విభజనపై హైకమాండ్ నిర్ణయానికి ఇరుప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎల్పీ మీటింగ్‌లో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నాయని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు