విద్యార్థి మృతదేహం లభ్యం

3 Aug, 2019 09:31 IST|Sakshi
చిర్రయానాంలో ఒడ్డుకు చేరిన శివ మృతదేహం 

సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : స్థానిక ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు పుట్టిన రోజు పార్టీ నేపథ్యంలో అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో గురువారం సాయంత్రం స్నానాలు చేస్తూ ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ముమ్మిడివరం మండలం బొండాయికోడు తూము ప్రాంతానికి చెందిన సానబోయిన హరి శుక్రవారం మృతి చెందగా, మరో విద్యార్థి గంటి శివ గాయత్రి కామేష్‌ (శివ) గల్లంతయ్యాడు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఓడలరేవు తీరంలో గల్లంతైన శివ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం కాట్రేనికోన మండలం చిర్రయానం తీరంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం సాయంత్రం నుంచి అల్లవరం పోలీసులు, కుటుంబసభ్యులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం వరకు ముమ్మరంగా గాలించినా ఫలితం దక్కలేదు.

అల్పపీడన ప్రభావంతో సముద్రంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో శివ మృతదేహం చిర్రయానం ఒడ్డుకి చేరింది. తీరంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అల్లవరం ఎస్సై చిరంజీవితో సిబ్బంది, కుటుంబసభ్యులతో హుటాహుటిన చిర్రయానం వెళ్లి, శివ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారని ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతుడికి తండ్రి, తల్లి, సోదరుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ భీమరాజు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృత్యువాత పడిన బీచ్‌ను సీఐ పరిశీలించారు. కాలేజీ విద్యార్థులే సముద్రంలో స్నానాలు చేస్తూ మృత్యువాత పడుతున్నారన్నారు. ఓడలరేవు బీచ్‌ స్నానాలు చేయడానికి సురక్షితం కాదని సీఐ తెలిపారు. 

బాధిత కుటుంబాలకు ఎంపీ అనురాధ సంతాపం 
ఓడలరేవు సముద్రంలో స్నానాలు చేస్తూ మృత్యువాత పడిన విద్యార్థులు సానబోయిన హరి, గంటి శివ కుటుంబాలకు అమలాపురం ఎంపీ చింతా అనురాధ సంతాపం వ్యక్తం చేశారు. ఓడలరేవు తీరంలో ప్రమాద తీవ్రతను తెలిపే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తీరానికి వచ్చే సందర్శకులకు అవగాహన కల్పించాలని ఎంపీ అనురాధ తెలిపారు. ఆదిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సం‘జీవన్‌’ కావాలి!

పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం

చోరి చేశాడనే అనుమానం‍తో బాలుడిపై...

విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే..

అయ్యా.. మాది ఏ కులం?

జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: విజయసాయి రెడ్డి

‘ముక్క’మాటానికిపోయి.. 

ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే..

ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద 

మహిళా ప్రగతి కేంద్రంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ

బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

నా రూటే.. సపరేటు ! 

బలవంతంగా స్కూల్‌కి.. బస్సులోంచి దూకేశాడు

ముసురు మేఘం.. ఆశల రాగం..

కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్‌ 

ప్రభుత్వాస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం

బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్రి ప్రమాదం

తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు సంపూర్ణ మద్దతు

పరిశ్రమల స్వర్గధామం ఏపీ 

సెప్టెంబర్‌ 8న కూడా సచివాలయాల పరీక్ష

7,966 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ 

కన్సల్టెన్సీలకు స్వస్తి 

పోలీసులూ.. ప్రజా సేవకులే!

నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!

వానొచ్చె.. వరదొచ్చె..

చంద్రయాన్‌–2 కక్ష్య దూరం పెంపు

ఏపీ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి: వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

వైఎస్సార్‌సీపీ రైతు పక్షపాతి : పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది