లోక్‌సభ ఎన్నికలకు నోడల్ అధికారులు.

7 Feb, 2014 02:08 IST|Sakshi
ఏలూరు, న్యూస్‌లైన్ : రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు 15 మంది నోడల్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ సిద్ధార్థజైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావును ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణకు, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ వి.సత్యనారాయణను ఈవీఎంల నిర్వహణకు, ఉప రవాణా కమిషనర్ పి.శ్రీదేవిని రవాణా ఏర్పాట్లకు, డీసీసీబీ సీఈవో వీవీఎన్ ఫణికుమార్‌ను ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణకు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.త్రిమూర్తులును ఎన్నికల సామగ్రికి, డ్వామా పీడీ నరాల రామచంద్రారెడ్డిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు కోసం నోడల్ అధికారులుగా నియమించారు. జిల్లా ఆడిట్ అధికారి సీహెచ్ నారయ్య ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ నాయుడు ఎన్నికల పరిశీలనకు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. 
 
 శాంతిభద్రతలు, విజిలెన్స్ అండ్ మోనిటరింగ్, రక్షణ ప్రణాళిక అమలుకు సంబంధించి నోడల్ అధికారిగా జిల్లా ఎస్పీ ఎన్.హరికృష్ణ వ్యవహరిస్తారు. సెట్‌వెల్ సీఈవో పి.సుబ్బారావును బ్యాలెట్ పేపర్ల పర్యవేక్షణ, సమాచార శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎన్.భాస్కర నరసింహం, డీపీఆర్‌వో ఆర్‌వీఎస్ రామచంద్రరావు మీడియా కమ్యూనికేషన్, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ  కంప్యూటరీకరణ, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్‌వీఈఈపీ, ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలకు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ డి.జ్ఞానేశ్వరరావు హెల్ప్‌లైన్, ఫిర్యాదుల విభాగం నిర్వహణ, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఎం.గంగాధరరావును ఎఫ్‌ఎంఎస్ పర్యవేక్షణ, కమ్యూనికేషన్ ప్లాన్ నిర్వహణకు నోడల్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
>
మరిన్ని వార్తలు