నృత్యం..హృద్యం

28 Dec, 2013 03:30 IST|Sakshi

ఆమనగల్లు,న్యూస్‌లైన్: ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ధ్యాన మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ధ్యాన మహాసభలు శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకున్నాయి. ఆ మహాసభలలో భాగంగా ఉదయం ప్రాతఃకాల ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రచించిన పుస్తకాలను, ధ్యానాంధ్రప్రదేశ్ జనవరి నెల సంచికను ది పిరమిడ్ స్పిరిచ్యుయల్ సొసైటీ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షీ సుభాష్‌పత్రీజీ  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  బ్రహ్మర్షీ పత్రీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ శరీరం విలువ తెలుసుకోవాలని కోరారు.
 
 ఈ కార్యక్రమాలలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు వెలగపూడి లక్ష్మణరావ్, నందాప్రసాదరావ్, దామోదరరెడ్డి, సాంబశివరావ్, నిర్మల, ఎస్‌ఆర్ ప్రేమయ్య, రవిశాస్త్రి, ధ్యానాంద్ర ప్రదేశ్ ఎడిటర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన మహాసభలలో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం ఆకట్టుకుంది. హైద్రాబాద్‌కు చెందిన విజయ్‌భాస్కర్‌చే స్వర, లయ, సుధ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్న వివిద కళాప్రదర్శనలు ధ్యానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
 

మరిన్ని వార్తలు