ఇలాగేనా రుణమాఫీ చేసేది?

23 Dec, 2014 02:14 IST|Sakshi

కుప్పం: రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారి ఆశలు నీరుగారిపోయాయి. మరో వైపు బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తోంది. ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామంటూ కుప్పంలో ప్రజాప్రతినిధులు అధికారులపై మండిపడ్డారు. సోవువారం వుండల సచివాల యుంలో రుణవూఫీపై ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జెడ్పీటీసీ రాజ్‌కువూర్ వూట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వంలో స్పష్ట త లోపించిందన్నారు.

చేసే మొత్తం ఒకేసారి చేస్తే బాగుంటుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కడా ఎస్వో ప్రియాంకను కోరారు. ఒకేసారి రూ.50 వేలు మాఫీ చేస్తామని చెప్పినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. బ్యాంకర్లు వేలం నోటీసులు పంపుతున్నారని, ఇలా చేస్తే ప్రభుత్వానికి, తమకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. కంగుంది గ్రామంలో ఒక రైతుకు సంబంధించి పాత అప్పు రూ.39 ఉండగా దాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మాజీ ఎంపీపీ చౌడప్ప మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని చెప్పారని, ఇప్పుడు ఆ పంటలకు రుణమాఫీ లేదని చెబుతుండడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందన్నారు. బ్యాంకర్ల తప్పిదం వల్ల చాలా మందికి రుణమాఫీ వర్తించలేదని, వీటన్నింటినీ సవరించి న్యాయం చేయాలని కోరారు.
 
 

మరిన్ని వార్తలు