ఆదాయం రూ.7.32కోట్లు తగ్గింది.

3 Mar, 2017 19:46 IST|Sakshi
ఆదాయం రూ.7.32కోట్లు తగ్గింది.

తిరుమల: కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.1000 పాత నోట్లు శ్రీవారి హుండీలో సమర్పించినా చెల్లవని శుక్రవారం టీటీడీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబరు 31వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రూ.8.29 కోట్లు లభించిందని వెల్లడించింది. పాత పెద్ద నోట్ల నిల్వ విషయంపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐతో సంప్రదించామని.. నిబంధనల ప్రకారం వాటి మార్పిడికి అవకాశం లేదని తెలిపినట్లు పేర్కొంది.

గడిచిన 61 రోజుల్లో మొత్తం రూ.8.29 కోట్లు టీటీడీ ఖజానాలో నిల్వ ఉంచామని వెల్లడించింది. వీటి మార్పిడి కోసం  చివరగా మరోసారి సంప్రదింపులు జరుపుతున్నట్లు టీటీడీ వివరించింది. వారి నుంచి తదుపరి ఉత్వర్వులు అందాకే ఉన్న కరెన్సీనోట్లపై  నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా, ఇదే గత ఏడాది ఫిబ్రవరిలో రూ.76.52 కోట్లు ఆదాయం రాగా, నోట్ల రద్దు ప్రభావంతోఈ ఏడాది రూ.7.32 కోట్లు తగ్గి రూ.69.20 కోట్లు ఆదాయం వచ్చింది.

మరిన్ని వార్తలు