మృత్యు లారీ

17 Dec, 2018 13:16 IST|Sakshi
లారీ వెనుక చక్రాల కింద నలిగిపోయిన పైడయ్య, (ఇన్‌సెట్‌) కర్రోతు పైడయ్య(ఫైల్‌)

ఇటుకల లోడుతో వెళ్తూ అదుపుతప్పి బోల్తా

వెనుక టైర్ల కింద ఇరుక్కుని ఒకరి దుర్మరణం

డ్రైవర్‌ సహా మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు

విశాఖపట్నం, తగరపువలస(భీమిలి): సంగివలస–పాండ్రంగి రహదారిలో భీమిలి మండలం తాటితూరు పంచాయితీ కళ్లాల వద్ద ఆదివారం సాయంత్రం ఇటుకల లారీ బోల్తా పడి న ప్రమాదంలో పాదచారి కర్రోతు పైడయ్య(48) దుర్మరణం పాలయ్యాడు. అదే ప్రమాదంలో డైవ ర్‌ సహా మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సా క్షులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయితీ సామియ్యవలస నుంచి ఇటుకల లోడుతో సంగివలస వైపు వస్తున్న క్వారీ లారీ తాటితూరు కళ్లాల సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. అ సమయంలో సామియ్యవలసకే చెందిన కర్రోతు పైడయ్య తగరపువలస సంత నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. లారీ బోల్తా పడడంతో వెనుక చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడని స్థానికులు తెలిపారు.

అయితే మరో కథ నం ప్రకారం... అదే లారీలో ఇటుకలపై కూర్చు న్న పైడయ్య లారీ అదుపు తప్పిన వెంటనే రక్షిం చుకునేందుకు గెంతే ప్రయత్నంలో వెనుక టైర్ల కిం ద చిక్కుకుపోయినట్టు తెలిపారు. ఇదే ప్రమాదంలో భోగాపురం మండలం ఉప్పాడపేటకు చెందిన లారీ కూలీ లు పట్నాల రమణ, సాడి కృష్ణ, డ్రైవ ర్‌ రామారావు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిం చారు. ఇటుకల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పుకోవడం వల్లే గాయాలతో బయట పడ్డారని... లేదంటే ఇటుకల మధ్య సజీవ సమాధి అయ్యేవారని స్థానికులు తెలిపారు. ఈ లారీ ఆనందపురానికి చెందిన దొంతల నాగరాజుదని తెలిపా రు. వ్యవసాయకూలీ అయిన పైడయ్యకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు అప్పలరాజు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె శాంతి కి ఇంకా వివాహం కావాల్సి ఉండగా కుమారుడు అప్పలరాజు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నట్టు తెలిపారు. పైడయ్య మృతితో సామియ్యవలసకు చెందిన పలువురు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గోస్తనీ నదీ తీరం దుఃఖసాగరమయింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలిచివేశాయి. సంఘటనా స్థలానికి భీమిలి లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్, రోడ్‌ సేఫ్టీ విభాగం సిబ్బంది చేరుకుని టైర్ల కింద చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు