‘తిత్లీ’తో నష్టపోయాం..

20 Nov, 2018 06:24 IST|Sakshi
తిత్లీ నష్టాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి వివరిస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

విజయనగరం :అన్నా.. తిత్లీ తుఫాన్‌ వల్ల పూర్తిగా నష్టపోయాం. ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 12 వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది.కనీసం పెట్టుబడి కూడా రాలేదు. మండలంలోని 320 ఎకరాల్లో అరటిపంట నాశనమైతే ఒక్క మా గ్రామంలోనే 120 ఎకరాల్లో పంట పోయింది. మీరు ముఖ్యమంత్రి కాగానే మాలాంటి వారిని ఆదుకోవాలి.– గిజబ రైతులు

రుణాలు ఇవ్వడం లేదన్నా..
అన్నా.. నేను పూర్తి వికలాంగురాలిని. నా తండ్రి కూలి పనికి వెళ్లలేని పరిస్థితి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. పెద్ద తమ్ముడు ఇంట్లో పరిస్థితి చూసి 10వ తరగతిలోనే చదువుమానేసి కూలి పనికి వెళ్తున్నాడు. రెండో తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. నా కాళ్లమీద నేను నిలబడేందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కాని రుణం మంజూరు కాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవ్వరూ న్యాయం చేయలేదు. నువ్వే ఆదుకోవాలన్నా..– డబ్బుకోట ఉషారాణి, తులసివలస 

మరిన్ని వార్తలు