ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు

20 Sep, 2013 04:01 IST|Sakshi
చిత్తూరు(క్రైమ్/కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్: పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని గురువారం వేర్వేరుగా రెండు ప్రేమజం టలు ఎస్పీ కాంతిరాణాటాటాను కలసి విన్నవించాయి. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన శ్రీరాములు కుమార్తె ఉమాదేవి(23) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోం ది. 6 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ తాలూకా సిద్దంపల్లెకు చెందిన లక్ష్మీపతితో ఉమాదేవికి పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో పెద్దల కు తెలియకుండా కోలారులోని ఓ దేవస్థానంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 
 
 ఈ విషయం తెలిసి అమ్మాయి తరఫు బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అలాగే పుత్తూరుకు చెందిన మరో ప్రేమజంట ఎస్పీని కలిసి రక్షణ కోరిన అనంతరం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. పుత్తూరుకు చెందిన ఆర్.పద్మజ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో తనతోపాటు పనిచేస్తున్న పుత్తూరుకు చెందిన పి.హరికృష్ణను ప్రేమించింది. వీరు ఈ నెల 8 వ తేదిన పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో పద్మజ కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించకుండా బెదిరిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వారు కోరారు.
 
మరిన్ని వార్తలు