రక్షణ కల్పించండి

19 Nov, 2018 14:11 IST|Sakshi
మాట్లాడుతున్న హేమశ్రీ

నెల్లూరు(దర్గామిట్ట): తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మిడతల హేమశ్రీ అనే యువతి కోరింది. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను దందు జగదీష్‌ అనే యువకుడు జూన్‌ నెలలో జొన్నవాడలో ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పింది. కుటుంబసభ్యుల్లో కొందరు భర్తను వదిలివేయమని చెబుతూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయింది. ఫోన్‌ చేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని తెలిపింది. తనను భర్తను వేరేచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి ఆదుకోవాలని కోరింది.   

మరిన్ని వార్తలు