మంత్రి జోక్యం.. హైకోర్టును ఆశ్రయించిన ప్రేమజంట

31 Jul, 2018 19:26 IST|Sakshi

మంత్రి దేవినేని ఒత్తిడి చేస్తున్నారంటూ ప్రేమజంట ఆరోపణ..

సాక్షి, అమరావతి : పోలీసులు వేధిస్తున్నారంటూ కృష్ణా జిల్లాకు చెందిన ప్రేమజంట మంగళవారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. నందిగామకు చెందిన సురేష్‌, శ్రీజ కులాంతర వివాహం చేసుకున్నారు, వీరి వివాహానికి శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ మేనమామ కంచికచర్ల టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు కావడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుంటునట్లు ప్రేమజంట ఆరోపిస్తోంది.

ఇద్దరిని విడగొట్టాలని దేవినేని ఒత్తిడి తెస్తున్నారని, శ్రీజను ఇంట్లో బంధించి పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని సురేష్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు సీఎస్‌, డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీతో పాటు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసింది. కేసును వెనక్కి తీసుకోవాలని నందిగామ డీఎస్సీ రాదేశ్‌ మురళి, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు వేధింపులకు పాల్పడుతున్నారని ప్రేమజంట తెలిపారు.

మరిన్ని వార్తలు