ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

28 Jan, 2018 08:46 IST|Sakshi

ఒకరిపై ఒకరు నిప్పంటించుకుని బలవన్మరణ

వరుసకు అన్నాచెల్లెలు కావడం, పెద్దలు పెళ్లికి ఒప్పుకోనందుకే..   

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వరు సకు అన్నాచెల్లెలు అని తెలియడంతో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు పెట్రోల్‌ పోసు కొని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం శివాపురానికి చెందిన ధరావత్‌ వెంకటేశ్వర్లు, పున్నిల కుమారుడు సాయి(19) గ్రామంలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్‌బీ తండకు చెందిన సునీత(18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ.. ఇద్దరూ పెద్దల్ని సంప్రదించారు. కానీ వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడం, ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావటంతో.. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.

దీంతో సాయి, సునీత 20 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.  పెనుగంచి ప్రోలులో మూడు రోజులపాటు కలిసి ఉన్నారు. ఈ ఘటనపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా.. సునీతను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.  సాయి శుక్రవారం ఎల్‌బీ తండకు వెళ్లి సునీతను తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం పెనుగంచిప్రోలు మండలంలోని లింగగూడెం – గౌరవరం రోడ్‌లో ఉన్న సుబాబుల్‌ తోటలోకి వెళ్లారు. తమపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించు కున్నారు. పొలాల్లో ఉన్న రైతులు గమనించి మంటలు ఆర్పివేశారు.  మెరుగైన వైద్యం కోసం వీరిని విజయవాడకు తీసుకెళ్లారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా