బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

4 Sep, 2014 10:11 IST|Sakshi

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్త్రాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని పేర్కొంది.

దీని ప్రభావంతో కోస్తాంధ్ర్లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నైరుతిదిశగా బలమైన ఈదురు గాలులు వీస్తామని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

>
మరిన్ని వార్తలు