నేడో, రేపో అల్పపీడనం?

5 Sep, 2014 01:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారానికి బలహీనపడింది. అయితే అదే సమయంలో వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొంది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. అల్పపీడనం ఆరంభంలో ఉత్తర కోస్తాపైన, ఆ తర్వాత తెలంగాణపైన ప్రభావం చూపుతుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ, తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు