స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

19 Sep, 2014 15:19 IST|Sakshi

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర కోస్తాకు ఈశాన్యదిశగా కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రాంతంలోనే 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ బలమైన ఉపరితల ఆవర్తనం వ్యాపించివుందని వెల్లడించింది. అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఉందని పేర్కొంది.

రాగల 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాతీరంలో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు