లాక్‌డౌన్‌ : ఉద్యోగులను తొలగించకండి

14 Apr, 2020 15:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో 15 శాతానికి మించి ఉత్పత్తి జరగడం లేదని సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్ రామకృష్ణ అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అనుమతించిన పరిశ్రమల్లో ఉద్యోగులు లేక, మార్కెట్ లేక ఉత్పత్తి ఎక్కువగా జరగడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని సీఐఐ తరఫున కోరుతున్నట్లు చెప్పారు.

ఉద్యోగులను తొలగిస్తే ఆయా పరిశ్రమలకు భవిష్యత్‌లో నష్టాలు వచ్చే అవకాశం ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వారికి మళ్ళీ కాపాబుల్ లేబర్ దొరకడం కష్టమన్నారు. పరిశ్రమల్లో ఆర్థిక ఇబ్బందులుంటే ఎక్కువ వేతనం పొందే వారికి కోత విధించి.. చిన్న కార్మికులకు మాత్రం పూర్తి జీతాలు ఇవ్వాలని పరిశ్రమల నిర్వహకులకు సూచించారు. కరోనా వైరస్‌ వలన ప్రజల అవసరాల్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని, వాటికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా