చంద్రబాబు కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ దృష్టి...

19 Apr, 2019 16:16 IST|Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరిన సీఈవో గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా సీఎం...ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో...దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించిన విషయం తెలిసిందే. 

చదవండి...(అంతా నా ఇష్టం!)

ఈసీ ఆదేశాలతో ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం నోటీసులు పంపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొనడంపై సీఎస్‌...సీఆర్డీఏ, జల వనరుల శాఖ వివరణ కోరారు. అలాగే సమీక్షల్లో పాల్గొన్న అధికారులు కూడా వివరణ ఇవ‍్వాలని సీఎస్‌ ఆదేశించారు. కాగా చంద్రబాబు నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. పోలవరం ప్రాజెక్ట్‌, సీఆర్‌డీఏ పనులపై సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు